Homeహైదరాబాద్latest News'కంగువ' మొదటి రోజు కలెక్షన్స్..! బాక్సాఫీస్ వద్ద ఎంత రాబట్టింది అంటే..!

‘కంగువ’ మొదటి రోజు కలెక్షన్స్..! బాక్సాఫీస్ వద్ద ఎంత రాబట్టింది అంటే..!

కోలీవడ్ స్టార్ సూర్య హీరోగా నటించిన సినిమా ‘కంగువ’. ఈ సినిమాలో సూర్యకి జోడిగా బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని హీరోయినిగా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాకి శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నవంబర్ 14న విడుదలైంది. ఎన్నో భారీ అంచనాలు మధ్య విదుదలైన ఈ సినిమా తొలి రోజు నుండే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. అయిత్ ఈ సినిమాకి తొలి రోజు వచ్చిన ఓపెనింగ్స్ మాత్రం పర్లేదు అనిపించుకున్నాయి. ఈ సినిమా మొదటి రోజుప్రపంచవ్యాప్తంగా ₹40 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇది భారతదేశంలో ₹28.50 కోట్లు మరియు ఓవర్సీస్‌లో ₹11.50 కోట్ల గ్రాస్ వసూలు చేసి మొత్తం ₹40 కోట్లకు చేరుకుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమా నిర్మాత కె.ఇ.జ్ఞానవేల్ రాజా మొదట్లో ‘కంగువ’ మూవీ ప్రపంచవ్యాప్తంగా ₹2000 కోట్లు వసూలు చేస్తుంది. అయితే ఈ సినిమాకు నెగిటివ్ టాక్ తో ఆ భారీ వసూళ్లను రాబట్టడం అంటే కష్టమే అని చెప్పాలి.

Recent

- Advertisment -spot_img