Homeసినిమాkareena kapoor: కరీనా.. ఫ్యాన్స్ ను పట్టించుకోదు

kareena kapoor: కరీనా.. ఫ్యాన్స్ ను పట్టించుకోదు

  • ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్

kareena kapoor: ఇదే నిజం, సినిమా: ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్ పై ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీనా కపూర్ తన అభిమానులను కనీసం పట్టించుకోదని ఆయన కామెంట్స్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో నారాయణమూర్తి మాట్లాడుతూ.. ‘నేను ఓ సారి లండన్ నుంచి ఫ్లైట్ లో వస్తున్నాను. నా పక్క సీట్ లో ప్రముఖ నటి కరీనా కపూర్ కూర్చున్నారు. ఆ టైమ్ లో ఆమెను కొంతమంది ఫ్యాన్స్ పలకరించగా అస్సలు పట్టించుకోలేదు’ అని నారాయణ మూర్తి వ్యాఖ్యానించారు. కాగా ఈ ఇంటర్వ్యూలో ఆమె పక్కనే ఉన్న సతీమణి సుధామూర్తి ఈ వ్యాఖ్యలను ఖండించారు. సినీ సెలబ్రిటీలకు కోట్లలో ఫ్యాన్స్ ఉంటారని అందుకే ఆమె పట్టించుకోకపోయి ఉండొచ్చని చెప్పారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Recent

- Advertisment -spot_img