న్యూఢిల్లీ: దేశంలో మోస్ట్ ఇన్నొవేటివ్ స్టేట్‌గా కర్నాటక తన స్థానాన్ని నిలుపుకుంది. ఆ తర్వాత మహారాష్ట్ర రెండో ప్లేస్‌లో నిలిచింది.
నీతి ఆయోగ్ బుధవారం ఇన్నొవేటివ్ ఇండెక్స్ 2020 విడుదల చేసింది. ఈ ఇండెక్స్‌లో టాప్ 5లో మన తెలంగాణ కూడా ఉంది.
తమిళనాడు మూడో స్థానంలో, తెలంగాణ నాలుగో స్థానంలో, కేరళ ఐదో స్థానంలో ఉన్నట్టు నీతి ఆయోగ్ పేర్కొంది.
నార్త్ ఈస్ట్, కొండ ప్రాంతాల్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరఖాండ్, మణిపూర్ రాష్ట్రాలు టాప్ 3లో ఉన్నాయి.
తొలిసారి ఇండియా ఇన్నొవేషన్ ఇండెక్స్‌ను 2019 అక్టోబర్‌లో నీతి ఆయోగ్ విడుదల చేసింది.
ప్రపంచవ్యాప్తంగా 80 అంశాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఇండియాలో 36 అంశాలను నీతి ఆయోగ్ లెక్కలోకి తీసుకుంది.
ఇండియా తన తయారీ సామర్థ్యాలను, ఎగుమతులను పెంచుకునేందుకు ఈ ఇండెక్స్ సాయం చేయనుందని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తెలిపారు.
రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను 17 మేజర్ స్టేట్స్‌గా, 10 నార్త్ ఈస్ట్, కొండ ప్రాంతాలుగా, 9 సిటీ స్టేట్స్, కేంద్ర పాలిత ప్రాంతాలుగా వర్గీకరించింది.