Homeహైదరాబాద్latest Newsకసాయి కన్నతల్లి : Crime News

కసాయి కన్నతల్లి : Crime News

– 8 నెలల ఆడ శిశువును పొలంలో పడేసి వెళ్లిన మహిళ
– చిన్నారిని పీక్కుతున్న వీధి కుక్కలు
– మంచిర్యాల జిల్లా కేస్లాపూర్​లో దారుణం


ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: ఎనిమిది నెలల పసికందుపై కన్నతల్లి కనికరం లేకుండా వ్యవహరించింది. ఆడ శిశువును పొలంలో పడేసి వెళ్లడంతో ఆ చిన్నారిని వీధి కుక్కలు పీక్కుతిన్నాయి. ఈ దారుణ ఘటన మంచిర్యాల జిల్ల భీమిని మండలం కేస్లాపూర్​లో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. కేస్లాపూర్‌ గ్రామానికి చెందిన ఓ మహిళ బుధవారం రాత్రి పొలంలో పసిబిడ్డను పడేసి వెళ్లింది. వీధి కుక్కలు చిన్నారిపై దాడి చేయడంతో ప్రాణాలు విడిచింది. శరీర భాగాలను పీక్కుతిని సుమారు 500 మీటర్ల దూరం లాక్కెళ్లి పడేశాయి. మృతదేహాన్ని గమనించిన స్థానికులు గురువారం మధ్యాహ్నం పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై విజయ్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. గ్రామానికి చెందిన మహిళను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img