ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాన్వాయ్‌ని పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తుండగా.. పోలీసులు ఆమె కాన్వాయ్‌ని తనిఖీ చేశారు. ప్రచారంలో భాగంగా ఆమె నిజామాబాద్ నుంచి కోరుట్లకు ప్రయాణిస్తుండగా.. పోలీసులు చెక్ చేశారు. ఆమె వాహనంతో పాటు తన వెంట ఉన్న ఇతర వాహనాలను సైతం పోలీసులు చెక్ చేశారు.