Homeహైదరాబాద్latest News'చిత్రవిచిత్రంగా ఉంది' : కేసీఆర్

‘చిత్రవిచిత్రంగా ఉంది’ : కేసీఆర్

తెలంగాణలో చాలా చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయని మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇతర ఎమ్మెల్యేలతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తుండగా రెండు సార్లు కరెంట్ పోయిందని X లో పోస్ట్ చేశారు. రోజుకు పదులసార్లు కరెంట్ పోతున్నట్లు ఎమ్మెల్యేలు చెబుతున్నారన్నారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఫల్యానికి ఇంతకన్నా నిదర్శనమేముంటుందని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలు, మేధావులు ఆలోచించాలని కోరారు.

Recent

- Advertisment -spot_img