Homeతెలంగాణనన్ను ఓడించేందుకు కేసీఆర్​ కుట్ర పన్నారు

నన్ను ఓడించేందుకు కేసీఆర్​ కుట్ర పన్నారు

– పాలేరుకు రూ.300 కోట్లు పంపించారు
– బీఆర్ఎస్​ ప్రజలు ఓట్లతో బుద్దిచెబుతారు
– కాంగెస్ నేత పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : పాలేరులో తనను ఓడించేందుకు సీఎం కేసీఆర్ కుట్ర పన్నారని కాంగెస్ నేత పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ఆరోపించారు. ఆత్మబలిదానాలతో సాధించుకున్న తెలంగాణను దొరల, దోపిడీ పాలన నుంచి కాపాడుకోవాలన్నారు. తెలంగాణ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్​కు అధికారంలోకి రావాలన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్​కు ప్రజలు ఓట్లతో బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇందిరమ్మ రాజ్యం కోసం కాంగ్రెస్​ పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజల బతుకులు ఆగమయ్యాయన్నారు. బీఆర్​ఎస్​ పది సంవత్సరాల్లో దోచుకున్న డబ్బుతో మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తుందన్నారు. ఇందులో భాగంగానే స్థానిక ఎమ్మెల్యేకు రూ.300 కోట్లు పంపించారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, కేసీఆర్ పంచే డబ్బు మనదేనని, ఆ డబ్బు తీసుకుని కాంగ్రెస్​ పార్టీకే ఓటు వేయాలని కోరారు

Recent

- Advertisment -spot_img