Siricilla : మాజీ సీఎం కేసీఆర్ సిరిసిల్ల బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 15 -20 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్లే ఈ పరిస్థితి నెలకొందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం, నాయకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
>ఈ ప్రభుత్వానికి నీటి నిర్వహణ చేయడం చేతకాదు : KCR
>ఆత్మహత్య చేసుకున్న 209 రైతుల వివరాలను సీఎస్‌కు అందజేశాం: KCR
>బోనస్ ఇవ్వకుంటే ప్రజలు వదిలిపెట్టరు: KCR
>రైతులకు న్యాయం చేయకపోతే ఊరుకునేది లేదు, ప్రభుత్వం వెంట పడతాం: KCR
>కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని 4 నెలలు మాట్లాడలేదు : KCR
>సూర్యాపేటకు నేను వెళ్లిన తరువాత నీళ్లు వదిలారు: KCR
>దళితులు, యాదవులు, రైతులు, మహిళలను మోసం చేశారు: KCR
>ఇప్పటికీ రైతుబంధు పూర్తస్థాయిలో ఇవ్వలేదు: KCR
>ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్క ఓవర్సీస్ స్కాలర్‌షిప్ ఇవ్వలేదు: KCR
>చేనేత కార్మికులకు వచ్చే బకాయిలు వెంటనే చెల్లించాలి: KCR