karimnagar : పొలంబాటలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ కరీంనగర్‌లోని ముగ్దుంపూర్ చేరుకున్నారు. ఎండిన పంటలను పరిశీలించారు. ఎమ్మెల్యలే దాస్యం వినయ్ భాస్కర్, పాడి కౌశిక్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ ఆయన వెంట ఉన్నారు. బండి సంపత్ అనే రైతుతో కేసీఆర్ మాట్లాడారు. రైతులకు భారాసా అన్నివిధాలా అండగా ఉంటుందని కేసీఆర్ భరోసా ఇచ్చారు. మద్యాహ్నం బోయినపల్లిలో ఎండిన పంటల గురించి రైతులను అడిగి తెలుసుకోనున్నారు. సాయంత్రం శౌభాష్‌పల్లి బ్రిడ్జి వద్ద మధ్యమానేరు జలాశయాన్ని పరిశీలించనున్నారు. సాయంత్రం 4 గంటలకు సిరిసిల్లలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో ప్రెస్‌మీట్.