– కేసీఆర్ తెలంగాణ కోసం కొట్లాడుతుంటే రేవంత్ ఎక్కడున్నారు?
– కాంగ్రెస్ కు ఓటేస్తే తెలంగాణను చంద్రబాబు చేతిలో పెడతారు
– పీసీసీ చీఫ్ రాష్ట్రాన్ని అమ్మేస్తాడు
– బీజేపీ ఎంపీ, కోరుట్ల అభ్యర్థి ధర్మపురి అర్వింద్
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: బీజేపీ ఎంపీ, కోరుట్ల అభ్యర్థి ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కన్నా.. కేసీఆర్ బెటర్ అంటూ వ్యాఖ్యానించారు. శనివారం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ తెలంగాణ కోసం కొట్లాడుతుంటే రేవంత్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే.. రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని టీడీపీ చేతిలో పెడతారని వ్యాఖ్యానించారు. రేవంత్ కంటే కేసీఆర్ మేలు. సీఎం కేసీఆర్ పదేళ్ల పాటు తెలంగాణ కోసం పోరాడారు. ‘కేసీఆర్ తెలంగాణ కోసం కొట్లాడేటప్పుడు రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో ఉన్నాడు, తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేశాడు. ఇప్పుడు చంద్రబాబు చెప్పినట్లు చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడుకు సంబంధించిన నాయకులంతా ఇప్పుడు కాంగ్రెస్‌లోనే ఉన్నారు. 2018 ఎన్నికల్లో హైదరాబాద్ నేనే కట్టానని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు?. కాంగ్రెస్‌కు ఓటు వేశారో తెలంగాణను తీసుకువెళ్లి ఆంధ్రాలో ఉన్న తెలుగుదేశం చేతిలో పెట్టినట్టే అని సంచలన కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి తెలంగాణను హోల్ సేల్‌గా అమ్మేస్తాడు. చంద్రబాబు కోసం సంచులను మోసుకెళ్లాడు’ అంటూ అర్వింద్ వ్యాఖ్యానించారు.