Homeఆంధ్రప్రదేశ్ప్రస్తుతం KCR పరిస్థితి ఇది..

ప్రస్తుతం KCR పరిస్థితి ఇది..

మాజీ సీఎం KCR ప్రస్తుతం వాకర్ సాయంతో నడుస్తున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో కాలు జారీ కిందపడిన విషయం తెలిసిందే. దీంతో kCR ఎడమ కాలు తుంటి ఎముకకు తీవ్ర గాయం అయింది. హైదరాబాద్ సోమజిగూడ యశోద ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందారు. తుంటి ఎముకకు సర్జరీ చేయించుకున్నారు. అనంతరం డిశ్చార్జి అయ్యారు. 8 వారాలు విశ్రాంతి తీసుకుంటే kCR కోలుకుంటారని వైద్యులు తెలిపారు.

ప్రస్తుతం కేసీఆర్ జూబ్లీహిల్స్ నంది‌నగర్‌ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ఆయనను వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. అన్ని ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అటు కేసీఆర్ కూడా వాకర్ సాయంతో అటూ, ఇటూ నడుస్తున్నారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు మాజీ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. జనవరి చివరి నాటికి స్టిక్ తో నడుస్తారని వైద్యులు చెప్పినట్లు ఆయన చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ త్వరగా కోలుకుని, రాజకీయాల్లో తిరిగి యాక్టివ్ అవ్వాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కోరుతున్నారు.

Recent

- Advertisment -spot_img