– గవర్నర్ తమిళిసైకి అందజేత
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలు కావడంతో సీఎం కేసీఆర్ తన పదవికి రాజీనామా చేశారు. ఆదివారం సాయంత్రం ఆయన రాజీనామా లేఖను తన ఓఎస్డీ ద్వారా గవర్నర్ తమిళిసైకి పంపించారు. అనంతరం ఆయన నేరుగా తన సొంత వాహనంలో ఫామ్ హౌస్కు వెళ్లారు. ఇక సీఎం కేసీఆర్ ఈ సారి గజ్వేల్, కామారెడ్డి రెండు చోట్ల నుంచి పోటీ చేయగా.. గజ్వేల్ నుంచి గెలుపొందారు. కామారెడ్డిలో ఓడిపోయిన విషయం తెలిసిందే.