కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటన పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో ప్రకృతి ప్రకోపానికి ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 143 మంది చనిపోయినట్లు కేరళ వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఈ ప్రమాదంలో సుమారు 128 మంది గాయపడ్డారు. వీరిని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వయనాడ్‌లో విపత్తు నిర్వహణ బృందాలు, సైనికులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.