నటి సన్నీలియోన్ ప్రదర్శనకు కేరళ యూనివర్సిటీ అనుమతి నిరాకరించింది. జులై 5న ఇవ్వనున్న ఈ ఈవెంట్‌కు అనుమతి ఇవ్వకూడదని యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్.. రిజిస్ట్రార్‌ను ఆదేశించారు. గతంలో చోటుచేసుకున్న విషాద సంఘటనలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ ప్రదర్శన నిర్వహించాలని భావించారు. గతేడాది కొచ్చిన్ యూనివర్సిటీలో సన్నీ ఓ కార్యక్రమం నిర్వహించగా.. తొక్కిసలాట జరిగి నలుగురు విద్యార్థులు మరణించిన సంగతి తెలిసిందే.