New ration card: కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు మీ సేవా కేంద్రాల వద్ద జనం బారులు తీరారు. ఈ నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ మరోసారి స్పందించింది. ‘రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియ.. దరఖాస్తులు సమర్పించడానికి ఎలాంటి గడువు లేదు. ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ చేయకూడదు. కుల గణన, ప్రజాపాలన్‌లో దరఖాస్తు చేసుకుంటే మళ్లీ చేయాల్సిన అవసరం లేదు. మీ సేవలో దరఖాస్తు చేసిన రసీదును ఎక్కడా ఇవ్వాల్సిన అవసరం లేదు’ అని స్పష్టం చేశారు.