తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కేబినెట్ సబ్ కమిటీ వేసి కొత్త రేషన్ కార్డులపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. మంగళవారం మీడియాతో చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. రేషన్ కోసం మాత్రమే రేషన్ కార్డు అని.. హెల్త్ కార్డు కోసం ఆరోగ్య శ్రీ అని క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని ఆయన తెలిపారు.