HomeSocial Mediaస్కిల్ డెవెలప్ మెంట్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

స్కిల్ డెవెలప్ మెంట్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

స్కిల్ డెవలెప్ మెంట్ కేసులో ఏపీ గవర్నమెంట్ తనపై నమోదు చేసిన 17A FIRను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే కేసు ఇరు పక్షాల వాదనలు విన్న అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం తీర్పును ఈ 16న ఉదయం వెల్లడించనుంది.

పోయిన సంవత్సరం అక్టోబర్ 20న తుది విచారణ జరిపి తీర్పును సుప్రీం ధర్మాసనం వాయిదా వేసింది. మరోవైపు సుప్రీంకోర్టులో చంద్రబాబు ఫైబర్ నెట్ కేసు విచారణ ఇంకా పెండింగ్ లోనే ఉంది. ఆ కేసులో ముందుస్తు బెయిల్ కోసం చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 17Aపై తీర్పు తర్వాత ఫైబర్ నెట్ కేసు విచారణ చేపడతామని.. అప్పటి వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని గతంలో సుప్రీంకోర్టు స్ఫష్టం చేసింది.

Recent

- Advertisment -spot_img