Homeహైదరాబాద్latest Newsరేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఇక KCR కనబడకుండా...

రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఇక KCR కనబడకుండా…

పథకాలపై ఇక నుంచి కేసీఆర్ పేరు కనిపించకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్కీమ్‌లలో కేసీఆర్ పేరుతో పాటు, అందుకు పథకాల పంపిణీలో కేసీఆర్ ఫోటోస్ కూడా తొలగించాలని కొత్త ప్రభుత్వం అధికారులకు ఆదేశాలిచ్చింది.

ప్రధానంగా హెల్త్, వెల్ఫేర్ శాఖలకు సీఎంవో ఆదేశాలిచ్చింది. ఏయే స్కీమ్‌లలో కేసీఆర్ పేరు వాడుతున్నారు? పంపిణీ వస్తువులపై ఫోటోలు వినియోగిస్తున్నారు? వంటి అంశాలపై ఆరా తీస్తున్నారు. స్కీమ్‌ల వివరాలను వెంటనే పంపాలని సీఎం ఆఫీస్ నుంచి ఉన్నతాధికారులు సంబంధిత డిపార్ట్ మెంట్లకు సూచించారు. ఈ నివేదికను సీఎంకు వివరించిన తర్వాత అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు తెలిసింది.

ప్రస్తుతం వైద్యారోగ్యశాఖ విభాగంలో కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, కేసీఆర్ అమ్మవడి వాహనాలు, కేసీఆర్ కంటి వెలుగు(పూర్తయింది) పథకాలు అమలవుతున్నాయి. ఆయా స్కీమ్‌ల నుంచి వెంటనే కేసీఆర్ పేరుతో తొలగించాల్సిందేనని సీఎం ఆదేశించినట్లు సమాచారం. వెల్ఫేర్‌లోనూ కొన్ని పథకాలకు కేసీఆర్ బొమ్మలను ప్రచురించడమే కాకుండా సంబంధిత విభాగాల ఆన్‌లైన్ పోర్టల్‌లోనూ కేసీఆర్ పేరు, ఫోటోలు ఉన్నాయి. దీంతో వాటన్నింటినీ వెంటనే తొలగించాలని ప్రభుత్వం భావిస్తున్నది. అయితే కేసీఆర్ పేరు తొలగించిన తర్వాత కొత్త పేర్లను పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img