Homeహైదరాబాద్latest Newsతెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు, సహాయకులకు పదవీ విరమణ వయసు 65 ఏళ్లుగా నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత వివరాలు పంపాలని మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ కాంతివెస్లీ ఆదేశించారు. సిబ్బంది పుట్టిన తేదీని పాఠశాల బోనఫైడ్‌ సర్టిఫికెట్‌ లేదా టీసీ లేదా మార్కుల మెమో ప్రకారం గుర్తించాలని శిశు సంక్షేమశాఖ సూచించింది. ఇవేమి సిబ్బంది దగ్గర లేకుంటే వైద్య ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని పేర్కొంది. అలాగే వారి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ప్రకటించింది. పదవీ విరమణ పొందుతున్న అంగన్‌వాడీ టీచర్‌కు రూ.లక్ష, మినీ అంగన్‌వాడీ టీచర్లు, సహాయకులకు రూ.50 వేలు ప్రభుత్వం ప్రోత్సాహకంగా ఇస్తుందన్నారు. వీరందరికీ ఆసరా పింఛన్లు మంజూరు చేస్తామని కూడా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

Recent

- Advertisment -spot_img