Homeహైదరాబాద్latest Newsసర్పంచ్ ఎన్నికలపై కీలక అప్డేట్.. ఈ వారంలో నోటిఫికేషన్ ?

సర్పంచ్ ఎన్నికలపై కీలక అప్డేట్.. ఈ వారంలో నోటిఫికేషన్ ?

తెలంగాణ ప్రభుత్వం సర్పంచుల ఎన్నికల దిశగా అడుగులు వేస్తోంది. ఎన్నికల పై క్షేత్ర స్థాయిలో సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. సర్పంచ్ ఎన్నికలను ఈ నెలలోనే పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కులగణన, జనాభా ఆధారంగా వారికి రిజర్వేషన్లు కల్పించే అంశంపై ప్రభుత్వం స్పష్టతకు రావడంతో మరో వారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్లపై కేంద్రం స్పందించకపోయినా, పార్టీ పరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. దీంతో ఎన్నికలు ఈనెలలోనే జరుగుతాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Recent

- Advertisment -spot_img