Homeహైదరాబాద్latest Newsఅయోధ్యలో KFC.. కానీ ఓ Twist

అయోధ్యలో KFC.. కానీ ఓ Twist

KFC పేరు వింటే చాలు నాన్‌వెజ్ ప్రియుల నోటిలో నీళ్లూరుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతిచోట అవుట్‌లెట్లు కలిగిన KFC త్వరలో అయోధ్యలోనూ దుకాణాలు తెరవబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం స్పందించింది. అయోధ్యలో మాంసాహార విక్రయాలపై నిషేధం ఉందని స్పష్టం చేసింది. కావాలంటే వారు శాకాహార పదార్థాలు అమ్ముకోవచ్చని తెలిపింది. అయోధ్యలో ఔట్‌‌లెట్ తెరవడాన్ని ఆహ్వానిస్తున్నామని అయితే, నిషేధిత ప్రాంతంలో శాఖాహార పదార్థాలు మాత్రమే విక్రయించాల్సి ఉంటుందని అయోధ్య జిల్లా కలెక్టర్ నితీశ్ కుమార్ తెలిపారు. మాంసం, చేపలు, ఇతర మాంసాహార పదార్థాల విక్రయం, వినియోగాన్ని రామాలయ ప్రాణప్రతిష్ఠకు ముందే యోగి ప్రభుత్వం నిషేధించిందని గుర్తు చేశారు. అయోధ్యకు 15 కిలోమీటర్ల పరిధి తర్వాత ఈ నిబంధనలేవీ వర్తించవని స్పష్టం చేశారు.

Recent

- Advertisment -spot_img