Homeసినిమాఖైదీ సీక్వెల్​ 'Very Special'

ఖైదీ సీక్వెల్​ ‘Very Special’

నటుడు కార్తీ, దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్​లో 2019లో వచ్చిన మూవీ ‘ఖైదీ. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి హిట్ కొట్టిన ఈ మూవీ.. కార్తీ కెరీర్​లో మంచి వసూళ్లు అందుకున్న సినిమాగా నిలిచింది. అయితే, ఈ సినిమా సీక్వెల్ కోసం మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ, దీనికి మాత్రం సమయం ఎక్కువే పడుతుంది. అయితే లేటెస్ట్ గా లోకేష్ ఈ అవైటెడ్ సీక్వెల్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ అందించాడు లోకేశ్ కనగరాజ్. తాను కూడా ఈ సినిమా కోసం ఎంతో ఎగ్జైటింగ్​గా ఎదురు చూస్తున్నాను అని తెలిపాడు. రజనీకాంత్​తో చేయబోతున్న సినిమా తర్వాత ఖైదీ–2 స్టార్ట్ చేస్తానని చెప్పుకొచ్చాడు. మధ్యలో ఉన్న కమిట్ మెంట్స్ వల్ల ఈ సీక్వెల్ లేట్ అవుతూ వస్తోందన్నాడు. అంతేకాకుండా ఈ ఖైదీ సిరీస్ తనకి వెరీ స్పెషల్ అని.. తన సినిమాటిక్ యూనివర్స్ ఆ మూవీ నుంచే మొదలైందంటూ లోకేశ్​ కనగరాజ్​ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్​ను అందించాడు. ప్రస్తుతం విజయ్, లోకేశ్​ కాంబినేషన్​ తెరకెక్కిన లియో రిలీజ్​కు సిద్ధంగా ఉంది.

Read More :

భారీ రేటుకు Guntur Karam థియేట్రికల్ రైట్స్..!
https://idenijam.com/guntur-karam-theatrical-rights-at-a-huge-rate/

Recent

- Advertisment -spot_img