Homeహైదరాబాద్latest Newsకిలాడీ దొంగలు.. తాళాలు వేసిన ఇండ్లే టార్గెట్.. క్షణాల్లో ఆభరణాలు, డబ్బులు లూటీ..!

కిలాడీ దొంగలు.. తాళాలు వేసిన ఇండ్లే టార్గెట్.. క్షణాల్లో ఆభరణాలు, డబ్బులు లూటీ..!

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో ఆదివారం అర్థరాత్రి రెండు ఇండ్లలో దొంగలు బీబత్సవం స్పష్టించారు. గాడిచర్ల సురేశ్, అలాగే గాడిచర్ల దేవయ్య ల ఇండ్లకు తాళాలు వేసి ఊరికి వెల్లారు. ఇదే అధునుగా బావించిన దొంగలు తాళాలు బద్దలు కొట్టి ఇంట్లోకి చొరబడి బీరువ తలుపులు తెరిచి గాడిచర్ల నరేశ్ ఇంట్లో రెండు తులాల బంగారం, 50 తులాల వెండి ఆభరణాలతో పాటు ముప్పైవేల నదును అపహరించారు. అలాగే గాడిచర్ల దేవయ్య ఇంట్లో లక్ష 85 వేల నగదుతో పాటు వెండి అభరణాలు ఎత్తికెల్లినట్లు బాధితులు రోదిస్తున్నారు. వీరి ఫిర్యాదు తో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఎస్ఐ శేఖర్ రెడ్డి క్లూస్టీం, ఫింగర్ ప్రింట్స్ సేకరిస్తూ సీసీ పుటేజులు సేకరిస్తున్నారు. కేసు నమేదు చేసుకోని దర్యాప్తు చేపడతామని తెలిపారు అలాగే గతంలో పెద్దమ్మ ఆలయంలో గ్రామంలో వరుస దొంగతనాలు జరుగుతుండడంతో ప్రజలు బయబ్రాంతులకు గురవుతున్నారు. ముదిరాజ్ సంఘ అధ్యక్షులు గాడి చెర్ల రామచంద్రం పోలీసులు వేగవంతంగా దర్యాప్తు చేపట్టి దొంగలను పట్టుకుని బాధిత కుటుంబాలను ఆదుకోవాలని పోలీసులను కోరారు.

Recent

- Advertisment -spot_img