Homeహైదరాబాద్latest Newsఘనంగా కేకే మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా కేకే మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు ఆధ్వర్యంలో సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ నామాపూర్ తెలంగాణ ముద్దుబిడ్డ కేకే మహేందర్ రెడ్డి 64వ జన్మదిన వేడుకలు రాజీవ్ గాంధీ చౌరస్తా వద్ద మండల కాంగ్రెస్ నేతలు కేక్ కట్ చేసి ఒకరినొకరు కేక్ తినిపించుకొని కేకే కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం కోసం అలుపెరుగని పోరాటం చేసి నేరెళ్ల సిరిసిల్ల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పలుమాలరా పోటీ చేసి అతి స్వల్ప ఓట్లతో ఓటమిపాలై ఈ ప్రాంత ప్రజల కోసం ప్రజల మధ్యలో ఉంటూ వారి బాగోగులు చూసుకుంటున్న నేత కేకే మహేందర్ రెడ్డి అని కొనియాడారు రానున్న రోజుల్లో రాష్ట్రంలోని ఉన్నత పదవులు పొందాలని కాంగ్రెస్ నేతలు ఆకాంక్షించారు. కేకేను దేవుడు ఆయురారోగ్యాలతో చూడాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి గుండం నరసయ్య, పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, మాజీ ఎంపిటిసి గుండెల్లి శ్రీనివాస్, తలారి నర్సింలు, పెద్దిగారి శ్రీనివాస్, దీటి నర్సింలు, అంజన్ రావు ఉచ్చిడి బాల్రెడ్డి, కొప్పు రమేష్, ఎలుసాని దేవయ్య, సద్ది మధు, మామిండ్ల ఆంజనేయులు, తాళ్ల విజయ రెడ్డి, శీల ప్రశాంత్, గాంత రాజు, కొండయ్య, రాజిరెడ్డి, శ్రీనివాస్, రంజాన్ నరేష్, భాను, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img