Homeసైన్స్​ & టెక్నాలజీమీ ఫోన్ హాక్ అయ్యిందేమో.. తెలుసుకోండిలా.. #Mobile #Hack #CyberCrime #CyberSecurity

మీ ఫోన్ హాక్ అయ్యిందేమో.. తెలుసుకోండిలా.. #Mobile #Hack #CyberCrime #CyberSecurity

సెల్ ఫోన్ ఈరోజుల్లో అందరి వద్ద ఉంది రోజు మొత్తం లో ఎక్కువ సమయం సెల్ ఫోన్ చూస్తూనే గడిపే వారు చాలా మంది ఉన్నారు.

తరచూ సెల్ ఫోన్ వాడుతున్న వాళ్ళు ఫోన్ హ్యాక్ అయ్యింది అనే విషయం గ్రహించడం కష్టమే.

అయితే ఫోన్ బ్యాటరీ చాలా తొందరగా అయిపోవడం, ఫోన్ లో డేటా కూడా అయిపోతుందా…? అయితే అది హ్యాకర్లు పని అయ్యి ఉంటుంది.

మీకు తెలియకుండానే సైబర్ నేరగాళ్లు మీ ఫోన్ ని వాళ్ళ ఆధీనం లోకి తీసుకున్నట్టే.

అదే కనుక నిజమైతే మీ ప్రయివసీ, విలువైన సమాచారం అన్ని వేరేవాళ్ళ చేతిలో ఉన్నట్టే.

మరి ఫోన్ హ్యాకింగ్ కు గురైందో లేదో తెలుసుకోవాలంటే ఎలా…? హ్యాక్ కాకుండా ముందే ఎలా జాగ్రత్త పడాలి…..? హ్యాకింగ్ అయ్యిందని ఎలా తెలుసుకోవాలి – మామూలు కంటే చాలా ఎక్కువగా బ్రొజింగ్ డేటా అయిపోతుంటే ఇది అనుమానించాల్సిందే.

మీ ఫోన్ వినియోగం ఎప్పటిలాగే ఉన్నప్పటికీ బ్రోజింగ్ డేటా చాలా వేగంగా అయిపోతుంటే ఓ కన్నేసి ఉంచాల్సిందే.

అని అమెరికా కంప్యూటర్ సెక్యూరిటీ సాఫ్టువేరు సంస్థ నార్దన్ చెపుతుంది.

ఈ మార్పు ను గుర్తించిన సమయంలోనే ఫోన్ బ్యాటరీ కూడా తొందరగా అయిపోతుండడాన్ని గుర్తిస్తే హ్యాక్ అయినట్లేనని నార్దన్ చెబుతుంది.

మరో సంస్థ ‘కాస్పరెస్కీ’ మరో ముఖ్యమైన విషయం చెప్పింది.

సైబర్ నేరగాళ్లు మీ ఫోన్ ని హ్యాక్ చేసి ఏదైనా అప్లికేషను లు చొప్పించినట్లయితే ఆ అప్లికేషన్ నడవడానికి మీ ఫోన్ ప్రాసెసింగ్ పవర్ పని చేస్తుంది అని అందువల్ల ఫోన్ వేగం పూర్తిగా తగ్గిపోతుంది అని కాస్పరెస్కీ చెబుతుంది.

కాబట్టి ఫోన్ స్పీడ్ తగ్గినా కూడా హ్యాక్ అయినట్లు అనుమానించాలి.

మెయిల్ కానీ, సోషల్ మీడియా ఎకౌంట్ లను గానీ మీకు సంభంధం లేని లొకేషన్స్ నుంచి ఎవరైనా యాక్సెస్ చేయడానికి ప్రయత్నించినట్టు గుర్తిస్తే వెంటనే అప్రమత్తం కావాలని ఈ రెండు సంస్థలు చెబుతున్నాయి.

ఫోన్ డేటా హ్యాకర్ల చేతిలో పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు – సిస్టమ్స్ వాడే వారు ఇంటర్నెట్, యాప్స్ విషయం లో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏ యాప్స్ పడితే ఆ యాప్స్ డౌన్లోడ్ చేయరాదు.

గూగుల్, యాపిల్ ప్లే స్టోర్ల నుంచే యాప్స్ డౌన్ చేసుకోవడం చాలా వరకు సురక్షితం.

ఏ విధంగా పరిచయం లేని వ్యక్తుల నుండి వచ్చే మెయిల్స్ ,మెస్సేజీలలో ఉండే లింక్లను పొరపాటున కూడా క్లిక్ చేయవద్దు.

అట్ఠాచ్మెంట్స్ డౌన్ లోడ్ చేయరాదు. వాటిలో మాల్ వేర్ ఉండే ప్రమాదం ఉంటుంది.

వై ఫై,బ్లూ టూత్ ద్వారా హ్యాక్ చేయడం సైబర్ నెరగాళ్లకు చాలా ఈజీ.

కనుక అవసరం లేని సమయాల్లో ఆ రెండూ ఆఫ్ చేయాడం మంచిదని మెకఫీ సంస్థ సూచిస్తుంది.

ఫోన్ లో అప్లికేషన్ లు ఎప్పటికప్పిడు అప్డేట్ చేసుకోవడం,ఫోన్ లు ఇతరులకు ఇవ్వకపోవడం వల్ల చాలా వరకు హ్యాక్ కాకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది అని కాస్ప రెస్కీ చెబుతుంది.

బహిరంగ ప్రదేశాలు రద్దీ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఫోన్ అవసరం లేక పోతే స్విచ్చాఫ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

హ్యాక్ అయితే…. ఏమి చేయాలి – మీ వద్ద ఉన్న ఫోన్ హ్యాక్ అయినట్టు తెలుసుకంటే వెంటనే అందులో ఉన్న అన్ని నెంబర్లు కు సమచారం ఇవ్వాలి.

మీ నుంచి వచ్చే మెయిల్స్,మెస్సేజీ లో ఉండే లింకులను క్లిక్ చేయ వద్దని చెప్పాలి.

అనుమానం కలిగించే అప్లికేషన్ ఏదైనా ఉంటే దానిని వెంటనే ఆన్ ఇంస్టాల్ చెయాలి.

వేరే డివైజ్ నుంచి లాగిన్ అయి మెయిల్, సోషల్ మీడియా ఖాతాల పాస్ వర్డ్ మార్చుకోవాలి. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే ఫోన్ రీ సెట్ చేసుకోవాలి.

Recent

- Advertisment -spot_img