Homeఆంద్రప్రదేశ్​మోడీ తన భార్యతో ఆలయాలకు రావాలి.. కొడాలి సంచలన వ్యాఖ్యలు

మోడీ తన భార్యతో ఆలయాలకు రావాలి.. కొడాలి సంచలన వ్యాఖ్యలు

అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీని సతీసమేతంగా ఆలయాలకు రమ్మని చెప్పాలని, ప్రధానిపై ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపి అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు స్వీకరించాకే ఆలయాలపై దాడులు పెరిగాయని వివాదాన్ని రాజేశారు. వేంకటేశ్వర స్వామిని కూడా చంద్రబాబు రాజకీయంగా వాడుకుంటున్నారన్నారు. శ్రీవారి దయవల్లే జగన్ సీయం అయ్యారన్నారు. పట్టు వస్త్రాలు సమర్పించేందుకు టీటీడీనే సీఎంను ఆహ్వానిస్తే డిక్లరేషన్ ఎందుకు సమర్పించాలన్నారు.
శ్రీవారిని దర్శించుకునే సమయంలో డిక్లరేషన్ సమర్పించాల్సిన అవసరం లేదని మరోసారి ఉద్ఘాటించిన ఆయన… స్వామి వారిపై నమ్మకంతోనే భక్తులు తిరుమలకు వస్తారన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని, డిక్లరేషన్‌పై చర్చ జరగాలన్నారు. సీఎం జగన్‌కు కులాల, మతాలతో సంబంధం లేదన్నారు. హిందూ దేవాలయానికి వచ్చినప్పుడు హిందువులా… చర్చిలో క్రైస్తవుడిలా… మసీదులో సమయంలో నవాబులా ఉంటారని నాని తెలిపాడు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img