HomeEnglishసీఎం రేవంత్ ప్రవర్తన గురించి కోదండరాం కామెంట్స్

సీఎం రేవంత్ ప్రవర్తన గురించి కోదండరాం కామెంట్స్

నామినేటెడ్ పోస్టులకు సంబంధించి తమ పార్టీకి కూడా కేటాయించాలని.. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడుతామని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. హైదరాబాద్‌లోని టీజేఎస్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ వచ్చిన తరువాత గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని అన్నారు. తాము తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేశామని గుర్తుచేశారు.

ప్రజాతీర్పును BRS గౌరవించడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలన కూలిపోతుందని బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించడం సరికాదని అసహనం వ్యక్తం చేశారు. ప్రగతి భవన్ ముందు ఉన్న గేట్లు బద్దలు కొట్టినప్పుడు సంతోషం కలిగిందన్నారు. సీఎం రేవంత్ ప్రవర్తన సామాన్య జనాలకు నచ్చుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో మార్పు వచ్చినట్టు ఢిల్లీ పాలనలో కుడా మార్పు రావాలని ఆయన చెప్పారు.

Recent

- Advertisment -spot_img