kokapeta:హైదరాబాద్‌లోని కోకాపేటలో మరికొన్ని ప్లాట్లను అమ్మేందుకు సర్కార్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. మరో 45 ఎకరాల్లో 7 ప్లాట్లను హెచ్‌ఎండీఏ విక్రయానికి వేలం వేయనుంది. ఎకరానికి కనీస ధర రూ.35 కోట్ల వరకు నిర్ణయించింది ప్రభుత్వం. అయితే కోకాపేట భూములకు గతంలో రికార్డు స్థాయి ధర పలుకగా, కనీస ధరకు పోయినా దాదాపు రూ.1,600 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా.
డిమాండ్ ఎక్కువ ఉండటంతో 2,500 కోట్లు వస్తుందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఈనెల 20వ తేదీన ప్రీబిడ్ సమావేశం జరగనుంది. రిజిస్ట్రేషన్‌కు నెలాఖరు వరకు అవకాశం ఉంది. ఆగస్టు 3న ‘ఈ- వేలం’ ద్వారా భూములను విక్రయం కొనసాగనుంది.