Homeహైదరాబాద్latest Newsకోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అహంకరిత వైఖరి నశించాలి.. నల్లగొండ జిల్లాను అభివృద్ధి చేసిన ఘనత బిఆర్ఎస్...

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అహంకరిత వైఖరి నశించాలి.. నల్లగొండ జిల్లాను అభివృద్ధి చేసిన ఘనత బిఆర్ఎస్ పార్టీది

ఇదే నిజం, దేవరకొండ: కోమటిరెడ్డి వెంకటరెడ్డి అహంకరిత వైఖరి నశించాలని బిఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షులు వేముల రాజు అన్నారు. మంగళవారం దేవరకొండ పట్టణంలో నిన్న అసెంబ్లీలో మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా దేవరకొండ మాజీ శాసనసభ్యులు,బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ పిలుపుమేరకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన,మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లాను అభివృద్ధి చేసిన ఘనత బిఆర్ఎస్ పార్టీది అని అన్నారు.జిల్లాను ఫ్లోరైడ్ రహితగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది,జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి ది అని ఆయన గుర్తు చేశారు గత 60 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లాకు ఏమాత్రం అభివృద్ధి చేయలేదని ఆయన తెలిపారు.కేవలం 10 సంవత్సరాల్లో టిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లాను అభివృద్ధి పథంలో నడపడం జరిగిందని ఆయన తెలిపారు. మోసపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు టిఆర్ఎస్ పార్టీ నాయకుల పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని ఆయన అన్నారు.ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వి నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ, యువజన విభాగం పట్టణ అధ్యక్షులు పొట్ట మదు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఖాదర్ బాబా,సత్తార్,నల్లాగసు సత్యనారాయణ,చంద్రమౌళి, నజీర్, ఆడరపు హరికృష్ణ,సబావత్ నరహరి,బాబా,ఎస్ కేమైబెల్లి, షేక్ జామిర్, తరి గోవర్దన్,అందుగుల సైదులు, పెద్దులు, సన్నీ వెంకటేష్,తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img