Homeహైదరాబాద్latest Newsపెట్రోల్ బంక్ ను ప్రారంభించిన కొండూరి రవీందర్ రావు, భారత్ పెట్రోలియం ఏరియా మేనేజర్

పెట్రోల్ బంక్ ను ప్రారంభించిన కొండూరి రవీందర్ రావు, భారత్ పెట్రోలియం ఏరియా మేనేజర్

ఇదే నిజం, గంభీరావుపేట: మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డీజిల్ పెట్రోల్ బంక్ భారత్ పెట్రోలియం సౌజన్యంతో పునః ప్రారంభించిన నాక్కబ్ కొండూరి రవీందర్ రావు భారత్ పెట్రోల్ ఏరియా మేనేజర్ శ్రవణ్ జీత్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కే డి సి సి చైర్మన్ కొండూరు రవీందర్ రావు మాట్లాడుతూ.. గంభీరావుపేట ప్రాంత ప్రజలు రైతులు డీజిల్ పెట్రోల్ కు పక్క మండలాలకు వెళ్ళవలసిన పరిస్థితి ఉండేదని వాటిని దృష్టిలో పెట్టుకుని కరీంనగర్ జిల్లాలోని మొట్టమొదటిగా ప్రాథమిక సహకార సంఘం ద్వారా 2010లో డీజిల్ పెట్రోల్ బంక్ ప్రారంభించుకున్నామని అన్నారు.

ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో 42 బంకులు ఉన్నాయని వాటిని భారత్ పెట్రోలియం సౌజన్యంతో అన్ని బంకుల తీరుగా వేసులుబాటు కల్పించిందని గతంలో సహకార బంకులకు సబ్సిడీ ఎత్తివేయడంతో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమని సహకార సంఘం బంకులలోఇబ్బందులు తొలగిపోయాయని అన్నారు . ఒకప్పుడు నేను బాధ్యతలు తీసుకున్నప్పుడు నిర్వీర్యం అవుతున్న సంఘం నష్టాల్లో ఉన్న సంఘాన్ని 35 కోట్ల వ్యాపారంకు చేరుకుందని రైతుల సహకారంతో కేంద్ర సహకార బ్యాంకు సహకారంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. అంతేగాక సహకార సంఘం బ్యాంకులు జాతీయస్థాయి బ్యాంకులకు దీటుగా పోటీపడే విధంగా ముందుకు తీసుకు వెళ్తున్నామని తెలిపారు ప్రజలంతా సహకార సంఘం మాది ఇదే మాకు అన్ని రకాల ఉపయోగపడుతుందని గర్వంగా చెప్పుకునే స్థాయికి మన సంఘాలు ఎదిగినయని అన్నారు. ఈ సంఘం మనదని భావనతో పని చేసినప్పుడు సంఘానికి పై స్థాయికి తీసుకు వెళ్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ రామంజి గౌడ్. మాజీ సర్పంచులు కటకం శ్రీధర్ పంతులు. మల్లుగారి నర్సా గౌడ్. మోతే రాజిరెడ్డి. బిఆర్ఎస్ సీనియర్ నాయకులు వెంకటస్వామి గౌడ్ కొమిరిశెట్టి లక్ష్మణ్. మాజీ ఏఎంసీ చైర్మన్ లు కొత్తింటి హనుమంత రెడ్డి లింగన్నగారి దయాకర్ రావు. డైరెక్టర్ లు రాజ్వీర్. రాజేశ్వరరావు . బిఆర్ఎస్ నాయకులు సంఘ సభ్యులు ఏగదండి స్వామి. వేణు సహకార సంఘం సీఈవో రాజిరెడ్డి సిబ్బంది రైతులు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img