kotancha sri Nurashimah swamy temple jatara
ఇదే నిజం, రేగొొండ : రేగొండ మండలం కోటంచ గ్రామంలో నరసన్న జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ ముల్కనూరు బిక్షపతి, ఈవో శ్రీనివాసులు ఏర్పాట్లను పరిశీలించారు. పిహెచ్ సి, వైద్యాధికారిని హిమబిందు ఆధ్వర్యంలో జాతరలో వైద్య సేవలను ఏర్పాటు చేశారు. చిట్యాల సిఐ మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో రేగొండ చిట్యాల టేకుమట్ల ,మొగుళ్ళపల్లి, ఘనపురం ఎస్ఐలు కలిసి బందోబస్తు నిర్వహించారు. ఈ నెల 19వ తేదీ నుంచి జరుగుతున్న జాతరకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు.
కోరుకున్న వారికి కొంగు బంగారం ఆని, కోరిన కోర్కెలు శ్రీ లక్ష్మీనరసింహస్వామి నెరవేర్చుతాడని ఇక్కడి భక్తుల నమ్మకం. ఈ జాతరకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తుంటారు. అనారోగ్యంతో ఉన్నవారిని నరసింహ స్వామి సన్నిధిలో మూడు లేదా ఐదు వారాలు ఉంచితే వారి రోగాలు నయం అవుతాయని భక్తుల నమ్మకం. ఆలయ కమిటీ చైర్మన్ ముల్కనూరు బిక్షపతి, ఈవో శ్రీనివాసులు ఏర్పాట్లను పరిశీలించారు.