Kriti Sanon : బాలీవుడ్ నటి కతిసనన్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తన బాయ్‌ఫ్రెండ్ ఎలా ఉండాలో చెప్తూ డేటింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ఫారనర్స్ హాట్‌గా ఉండొచ్చు కానీ ఇప్పటివరకు నేను ఏ విదేశీయుడికి అట్రాక్ట్ కాలేదు. నాకు భారతీయ మగాళ్లంటేనే ఇష్టం. ఇక్కడివాళ్లతోనే డేటింగ్‌కు ఇష్టపడతాను. హిందీ అర్థం చేసుకునే మగాడు అయితే ఓకే. నేను ప్రతిసారీ ఇంగ్లీష్‌లో మాట్లాడలేను. నాతో కలిసి పంజాబీ, హిందీ పాటలకు డ్యాన్స్ చేసే ఇండియన్ కావాలి. ‘ అన్న కృతిసనన్ కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇప్పటికే కృతి సనన్ ఓ వ్యక్తితో డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తనకంటే వయసులో 10 ఏళ్లు చిన్నవాడు, స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోనీకి అత్యంత సన్నిహితుడైన కబీర్ బహియాతో కృతి సనన్ లవ్ ట్రాక్ నడిపిస్తోందని బాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది.