Homeతెలంగాణktr:విపత్కర సమయంలో రాజకీయాలొద్దు

ktr:విపత్కర సమయంలో రాజకీయాలొద్దు

విపత్కర సమయంలో రాజకీయాలొద్దు

  • మంత్రి కేటీఆర్
  • వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన

ఇదే నిజం, హైదరాబాద్: ప్రస్తుత విపత్కర సమయంలో రాజకీయాలు చేయొద్దని మంత్రి కేటీఆర్ సూచించారు. ఇవాళ ఆయన హైదరాబాద్ లోని వరద ప్రభావిత ప్రాంతాల్లోపర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్షాలు, వరదలకు ప్రాణ నష్టం జరగకుండా చూడటమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. హుస్సేన్ సాగర్ వద్ద వరద ఉధృతిని పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు, ఆయా ప్రాంతాలకు సంబంధించిన అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వరద నీరు నిలిచిన పట్టణాల్లో మరిన్ని సహాయక చర్యలు చేపడతామని చెప్పారు. శిథిల భవనాల నుంచి జనాలను వెంటనే తరలించాలన్నారు. హైదరాబాద్ నుంచి పురపాలక శాఖ అధికారులు, అడిషనల్ కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ కి రెడ్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకుందని తెలిపారు మంత్రి కేటీఆర్. డీసిల్టింగ్ ఇప్పటికే పూర్తయిందని, చెరువుల బలోపేతానికి తీసుకున్న చర్యల వల్ల నష్టం అదుపులో ఉందన్నారు. 135 చెరువులకు గేట్లు బిగించామని చెప్పారు. గతంలో ఇలాంటి భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు జలమయం అయ్యేవని, ఈసారి నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం వలన వరద ప్రభావం కాస్త తగ్గిందన్నారు ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం.. 24 గంటలు వర్షాలను ఎదుర్కోడానికి పనిచేస్తోందన్నారు. పురపాలక ఉద్యోగులకు అన్ని సెల లు రద్దు చేశామని ప్రకటించారు కేటీఆర్.

Recent

- Advertisment -spot_img