Homeఫ్లాష్ ఫ్లాష్KTR:నడ్డా ..రేవంత్ సొల్లు మాటలు: కేటీఆర్ ఫైర్..

KTR:నడ్డా ..రేవంత్ సొల్లు మాటలు: కేటీఆర్ ఫైర్..

KTR:ఒక్కటి కూడా నడ్డా పనికి వచ్చేవి మాట్లాడలేదు. సొల్లు మాటలు చెప్పి పోయారంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ ను జైల్లో వేస్తామని అంటున్న బిజెపి వాళ్లు ఎందుకు వేస్తారో చెప్పాలి. అభివృద్ది చేసినందుకా..? అని ప్రశ్నించారు.ఉప్పల్ స్కై వాక్ ప్రారంభించిన సందర్బంగా కేటీఆర్ మాట్లాడారు. నడ్డా గుర్తు పెట్టుకోవాలి అడ్డగోలుగా మాట్లాడితే ఉరుకునేది లేదంటూ పేర్కొన్నారు. 9 ఏళ్లలో నగరంలో శాంతిభద్రతలు ప్రశాంతంగా ఉండటంతో పెట్టుబడులు వస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి నీ చూస్తే ఒక కథ గుర్తుకు వస్తుంది.. అమ్మానాన్నని చంపి అనాథను వదిలేయండి అన్న కుర్రాడి కథను కేటీఆర్ చెప్పారు. అమరవీరులు చనిపోయింది ఈ కాంగ్రెస్ వల్లే కదా. మళ్లీ అమరవీరుల స్థూపం గురించి మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. 50 లక్షల నొట్ల కట్టలతో దొరికి చిప్పకుడు తిన్నవాడు వచ్చి నీతులు చెప్తున్నాడంటూ విమర్శించారు.

ఈ ఐదా రెళ్ళలో రాష్ట్ర ప్రభుత్వం 35 ఫ్లై ఓవర్ లను నిర్మించిందని తెలిపారు. ఉప్పల్ ఫ్లై ఓవర్ ను కేంద్రం తీసుకుంది.. ఇంకా దాన్ని పూర్తి చేయడం లేదంటూ విమర్శించారు. జాతీయ రహదారి అని ఫోజులు కొట్టి.. నాలుగేళ్లుగా కట్టలేకపోతున్నారన్నారు. కేంద్రం కడుతున్న ఉప్పల్, అంబర్ పేట ఫ్లై ఓవర్లు ఇంకా పూర్తి కాట్లేదని పేర్కొన్నారు. ఉప్పల్ లోని 10 డివిజన్ లలో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాళ్లు కడతామని తెలిపారు.

విశాలమైన స్కై వాక్‌ ప్రారంభోత్సవంతో పాదచారుల నడక కష్టాలు, ట్రాఫిక్ ఇబ్బందులు తప్పనున్నాయి. ఎక్కడా రోడ్డు దాటే అవసరం లేకుండా.. నాలుగు వైపులా వెళ్లేందుకు వీలుగా 665 మీటర్ల పొడవు.. 4 మీటర్ల వర్టికల్‌ వెడల్పు.. 6 మీటర్ల ఎత్తులో బస్టాపులు.. మెట్రోస్టేషన్‌ను కలుపుతూ.. కాలినడక వంతెనను నిర్మించారు. 8 చోట్ల లిఫ్ట్‌లు, 4 ఎస్కలేటర్స్‌, 6 చోట్ల మెట్ల సౌకర్యాన్ని కల్పించారు. నాగోల్ రోడ్డు, రామంతాపూర్ రోడ్డు, జీహెచ్ఎంసీ థీమ్ పార్క్, జీహెచ్ఎంసీ ఆఫీసు స‌మీపంలోని వ‌రంగ‌ల్ బ‌స్టాప్.. ఉప్పల్ పోలీస్ స్టేష‌న్, ఉప్పల్ ఎల‌క్ట్రిక‌ల్ స‌బ్‌స్టేష‌న్ ఎదురుగా స్కై వాక్ బ్రిడ్జి ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను ఏర్పాటు చేశారు.

Recent

- Advertisment -spot_img