తెలంగాణలో ఓటమి తరువాత బీఆర్ఎస్ అనేక రకాలుగా ఇబ్బందులు పడుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కారు పార్టీ ఎమ్మెల్యేలు అందరూ హస్తం గూటికి చేరుతున్నారు. దీంతో పార్టీని బతికించుకోవాలని కేసీఆర్ తన వ్యూహాలకు పదును పెట్టారట.. పాత ఫార్ములానే కొత్తగా ప్రయోగించాలని చూస్తున్నారు. అయితే తెలంగాణ ప్రాంతాన్ని రెండు భాగాలుగా విభజించి.. కేటీఆర్, హరీశ్ రావులకు ఆ ప్రాంతాల పాదయాత్ర బాధ్యతను అప్పగించినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు వినికిడి.