Homeహైదరాబాద్latest NewsKTR: ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం

KTR: ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం

సిరిసిల్ల జిల్లా కోనరావుటపేట మండల కేంద్రంలో కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్‌కుమార్‌ తరపున నిర్వహించిన రోడ్‌ షోలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. ఏడాదిలోగా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కావడం లేదన్నారు. రెండు లక్షల రుణ మాఫీ, పేదల వివాహాలకు తులం బంగారం, రైతులకు 24 గంటల కరెంట్, ఆరు హామీలు ఎక్కడా అమలు కావడం లేదని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారన్నారు. కేంద్రంలో మోడీని, రాష్ట్రంలో రేవంత్ రెడ్డిని బడే భాయ్, ఛోటే భాయ్ అని అభివర్ణించారు. దేవుడిని అడ్డం పెట్టుకుని తామెప్పుడూ రాజకీయాలు చేయలేదని ఆయన అన్నారు.

Recent

- Advertisment -spot_img