Homeహైదరాబాద్latest Newsప్రభుత్వానికి కేటీఆర్ మరో సవాల్.. అది నిరూపిస్తే రాజీనామా చేస్తా..!

ప్రభుత్వానికి కేటీఆర్ మరో సవాల్.. అది నిరూపిస్తే రాజీనామా చేస్తా..!

అసెంబ్లీ వేదికగా ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో సవాల్ విసిరారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 32 వేల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్‌రెడ్డి సభను తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో నిరుద్యోగులు.. ఒక్క ఉద్యోగం రేవంత్‌ ప్రభుత్వం ఇచ్చిందని చెబితే అక్కడే రాజీనామా చేస్తానని సవాల్​ చేశారు. అలాగే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు.

తులం బంగారం ఏమైంది..?
కళ్యాణ లక్ష్మీ పథకంలో భాగంగా రూ.1,01,116 చెక్కుతో పాటు ఇస్తామన్న తులం బంగారం ఏమైంది అని కేటీఆర్ ప్రశ్నించారు . ఇవాళ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ముఖ్యంగా మహిళలను మోసం చేసిందనే చెప్పాలి. నెలకు రూ.2,500, కళ్యాణలక్ష్మీ తులం బంగారం గురించి ప్రస్తావించారు. అయితే గత ప్రభుత్వం అప్పులు చేసిందని మాపై నిందలు మోపుతున్నారు.

Recent

- Advertisment -spot_img