Homeహైదరాబాద్latest NewsKTR: రేవంత్ రెడ్డి తన సొంత జిల్లాలో గెలవడం కూడా కష్టమే

KTR: రేవంత్ రెడ్డి తన సొంత జిల్లాలో గెలవడం కూడా కష్టమే

నేడు తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ… దమ్ముంటే హరీష్ రావు సవాల్‌కు రేవంత్ రెడ్డి స్పందించాలని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇటీవలే హరీష్ రావు ఆగష్టు 15 సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, అలా నెరవేరిస్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, దమ్ముంటే సవాలు స్వీకరించమని హరీష్ రావు అన్న సంగతి తెలిసిందే. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ ‘దమ్ముంటే హరీష్ రావు గారి సవాల్ కు రేవంత్ రెడ్డి స్పందించాలని అన్నారు. రేవంత్ రెడ్డిది మాట నిలుపుకున్న చరిత్ర కాదు. కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం అన్నాడు. 2018 లో చిత్తు చిత్తుగా ఓడిపోయిన కూడా ఇక్కడే ఇంకా తిరుగుతున్నాడని కేటీఆర్ అన్నారు. హెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా గెలుస్తామని చెప్పి ఓడిపోయిన తర్వాత మాట తప్పాడు’ అని విమర్శించారు. రేవంత్ రెడ్డి తన సొంత జిల్లాలో గెలవడం కూడా కష్టమేనని వ్యాఖ్యానించారు.

Recent

- Advertisment -spot_img