తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో మరోసారి కేటీఆర్, హరీశ్ రావు ములాఖత్ అయ్యారు. బెయిల్ సహా పలు అంశాలను ఆమెకు వివరించారు. లిక్కర్ స్కాం కేసులో ఐదు నెలలుగా ఆమె జైలులోనే ఉన్నారు. మరోవైపు కవితను బయటకు తీసుకొచ్చేందుకు న్యాయ నిపుణులతోనూ కేటీఆర్ చర్చిస్తున్నారు.