HomeతెలంగాణKtr On Dalita Bandhu : అలా చేస్తే దళితబంధుతో రెట్టింపు సంపద

Ktr On Dalita Bandhu : అలా చేస్తే దళితబంధుతో రెట్టింపు సంపద

Ktr On Dalita Bandhu : అలా చేస్తే దళితబంధుతో రెట్టింపు సంపద

Minister Ktr On Dalita Bandhu: కొత్త ఆలోచనలు చేసి దళితబంధును సద్వినియోగం చేసుకోవాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

సిరిసిల్ల జిల్లాకి చెందిన 119 మంది కుటుంబాలకు దళితబంధు నిధులను పంపిణీ చేశారు.

దళితబంధు పథకంతో దళితుల రూపురేఖలు మార్చడానికి ఆలోచించిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.

సిరిసిల్ల జిల్లాలో దళితబంధు ఆస్తుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

దళితబంధు విజయవంతం కావాలని ఆయన కోరారు. 119 మంది కుటుంబాలకు దళితబంధు నిధులను పంపిణీ చేశారు.

దళితబంధు నిధులతో అందరూ వాహనాలే కాకుండా… వివిధ రూపాల్లో పెట్టుబడులు పెట్టి సంపదను రెట్టింపు చేసుకోవాలని కోరారు.

దళితబంధు నిధులతో ఎక్కడైనా పెట్టుబడులు పెట్టుకోవచ్చని ఆయన తెలిపారు.

రాష్ట్రంలో దళితబంధు నిధులతో ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు.

రూపాయి పెట్టుబడితో రూపాయిన్నర రాబడి గురించి ఆలోచించాలి.

Egg Side Effect : గుడ్డు మంచిదని ఎక్కువ తింటున్నారా..? అయితే డేంజ‌రే..

Apple : రోజుకో ఆపిల్‌తో జీర్ణ స‌మ‌స్య‌లకు చెక్‌

దేశంలో మంచి పని చేయడానికి లక్ష తొంభై అడ్డంకులు ఉంటాయి.

కానీ చెడు పని చేయడానికి ఒక్కటి అడ్డంరాదు. దళితబంధు నిధులతో పలు రకాల వ్యాపారాలు చేస్తామని లబ్ధిదారులు అంటున్నారు.

ముగ్గురు, నలుగురు కలిసి ఉమ్మడి వ్యాపారం చేస్తే మరింతగా వృద్ధి సాధించవచ్చు.

కేవలం ఎస్సీలకే కాదు.. క్రమంగా మిగతా వర్గాలకు దళితబంధు తరహా పథకం ఇస్తాం.

సమాజంలో రెండే కులాలున్నాయి.. పేద కులం, ధనిక కులం.

దళితబంధు నిధులతో ట్రాక్టర్లు, హార్వెస్టర్లే కొంటామంటే నేను రాను.

గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు దళితబంధు పథకాన్ని విజయవంతం చేయాలి.

దళితబంధు నిధులతో కొందరు ఒకే రకమైన వ్యాపారాలకు ప్రాధాన్యమిస్తున్నారని కేటీఆర్‌ అన్నారు.

ట్రాక్టర్లు, హార్వెస్టర్ల వైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారన్న ఆయన… ముగ్గురు, నలుగురు కలిసి వ్యాపారం చేస్తే మరింతగా అభివృద్ధి చెందుతుందని సూచించారు.

ఎస్సీలనే కాదు.. క్రమంగా మిగతా వర్గాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

Medical shop : బ్రాండ్ వేరు కానీ మందు అదే అని మెడికల్ షాప్ వాళ్ళు మందులు ఇస్తే.. మ‌నం చూడాల్సింది ఏమిటి?

Payment Apps : గూగుల్ పే, ఫోన్ పే వంటి యాప్‌లు డబ్బు ఎలా సంపాదిస్తాయి?

కొత్త ఆలోచనలు చేసి దళితబంధును సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్‌ చిన్న పనులు చేసే వ్యక్తి కాదు. 

కేసీఆర్‌.. ఒక రిఫార్మర్‌, సమాజంలో మార్పు కోరుకొనే వ్యక్తి. 1987లో భారత్‌, చైనా రెండింటి జీడీపీ 470 బి.డాలర్లు. 

ఈ 35 ఏళ్లలో యూరప్‌, జపాన్‌తో చైనా పోటీపడింది. 

కులం, మతం జోలికెళ్లకుండా పెట్టుబడులకు పోటీ పడ్డారు. 

ఇప్పుడు మన దేశ జీడీపీ 2.93 ట్రిలియన్‌ డాలర్లు. ఇప్పుడు చైనా జీడీపీ 16 ట్రిలియన్ డాలర్లు. 

మన దేశంలో తలసారి ఆదాయం రూ.2వేల డాలర్లు. 

చైనా తలసరి ఆదాయం రూ.14వేల డాలర్లు. మనం కులం, మతం గొడవలంటూ అక్కడే ఉన్నాం.

-- కేటీఆర్‌, మంత్రి 

Rakesh jhunjhunwala : ఒకే రోజులో రూ. 861 కోట్లు సంపద‌

North Korea : ఉత్తర కొరియాను సందర్శించి రావడం భారతీయులకు సాధ్యమేనా..?

Recent

- Advertisment -spot_img