Homeహైదరాబాద్KTR: ఇంటింటికీ బ్లీచింగ్‌ పౌడర్, క్లోరిన్‌ మాత్రల పంపిణీ

KTR: ఇంటింటికీ బ్లీచింగ్‌ పౌడర్, క్లోరిన్‌ మాత్రల పంపిణీ

హైదరాబాద్‌: హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షాల కార‌ణంగా అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందునా ప్ర‌జ‌ల ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ‌కు యుద్ధప్రాతిపదికన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మినిస్ట‌ర్ కేటీఆర్ అధికారులను ఆదేశించారు.

ఇంటింటికీ బ్లీచింగ్‌ పౌడర్, క్లోరిన్‌ మాత్రలు పంపిణీ చేయాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. మంత్రి ఆదేశాలకు మేరకు జలమండలి అధికారులు వెంటనే పంపిణీ ప్రారంభించారు.

సంపులను, ట్యాంకులను ప్రభుత్వం సరఫరా చేసే బ్లీచింగ్‌ పౌడర్‌తో శుభ్రం పరుచుకోవాలని, సరఫరా చేసే తాగునీటిలో క్లోరిన్‌ మాత్రలు కలుపుకొని వాడుకోవాలని జలమండలి ప్ర‌జ‌ల‌కు సూచించింది.

హైదరాబాద్‌లో సాధ్యమైనంత త్వరగా పరిస్థితిని చక్కదిద్దేందుకు అన్నిచర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

ఈ స‌మ‌యంలో ప్రజలు తాగునీటి విష‌యంలో కొన్నిరోజులపాటు జాగ్రత్తలు తీసుకోవాల‌ని కేటీఆర్ ప్ర‌జ‌ల‌కు సూచించారు. కాచివ‌డ‌పోసిన నీటినే తాగితె సీజ‌న‌ల్ వ్యాధులు ధరిచేరవని చెప్పారు.

వ‌ర‌ద ముంపు ప్రాంతాల్లో ప్రజలకు అవ‌స‌ర‌మైన వైద్య సదుపాయాలు క‌ల్పించాల్సిందిగా క్షేత్ర‌స్థాయి వైద్యాధికారుల‌కు కేటీఆర్ ఆదేశించారు.

Recent

- Advertisment -spot_img