Homeఫ్లాష్ ఫ్లాష్KTR: గ్రేట‌ర్‌ ఎన్నికల కంటే ముందే బీజేపికి షాక్‌.. కేటీఆర్‌ ఒత్తిడికి తలొగ్గిన ప‌వ‌న్‌!

KTR: గ్రేట‌ర్‌ ఎన్నికల కంటే ముందే బీజేపికి షాక్‌.. కేటీఆర్‌ ఒత్తిడికి తలొగ్గిన ప‌వ‌న్‌!

హైద‌రాబాద్ః గ్రేట‌ర్‌లో అన్ని తానై చ‌క్రం తిప్పుతున్నరు మినిస్ట‌ర్ కేటీఆర్‌. ఇక గ‌ట్టి పోటీ ఇయ్యాల‌నుకుంటున్న బీజేపీకి గ్రేట‌ర్ ఎన్నిక‌ల కంటే ముందే గ‌ట్టి షాక్ కేటీఆర్ ఇచ్చారు.

ప‌వ‌న్ ఆధ్వ‌ర్యంలోని జ‌న‌సేన‌-బీజేపీ క‌ల‌యిక కేవ‌లం ఏపీకే ప‌రిమిత‌మ‌ని, గ్రేట‌ర్ ప‌రిధిలో బీజేపీ త‌ర‌పున‌ ఎన్నిక‌ల ప్ర‌చారం చేసేదీ లేద‌ని ప‌వ‌న్ తెగేసి చెప్పిన‌ట్లు టీ టౌన్‌లో స‌మాచారం.

హైద‌రాబాద్‌లో టీఆర్ ఎస్‌కు వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేసేందుకు సినీ ఇండ‌స్ట్రీ నుంచి ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు. ఎందుకంటే హైద‌రాబాద్‌లోని తెలుగు సినీ ఇండ‌స్ట్రీ పెద్ద‌ల‌కి కేటీఆర్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి.

ఈ నేప‌థ్యంలో కేటీఆర్‌కి వ్య‌తిరేకంగా ఎవ‌రూ ప్ర‌చారం చేయొద్ద‌ని అంద‌రూ స‌మ‌ష్టిగా నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. పైగా ప‌వ‌న్‌కు కేటీఆర్‌కి మ‌ధ్య కూడా మంచి సంబంధాలు ఉన్నందునా బీజేపీకి నిరాశే ఎదురైంది.

ఏపీలో ఒక మాట, తెలంగాణలో ఒక మాట పవన్ మాట్లాడతారా లేక, గ్రేటర్ అన్నికల సమయానికి షూటింగుల్లో బిజీ అయిపోయి కనుమరుగైపోతారా అన్నది వేచి చూడాలి.

Recent

- Advertisment -spot_img