Homeహైదరాబాద్latest NewsKTR: బీఆర్ఎస్ పుట్టుకే ఒక సంచలనం

KTR: బీఆర్ఎస్ పుట్టుకే ఒక సంచలనం

తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఆవిర్భవించిన బీఆర్ఎస్ పార్టీ నేడు 24వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకుంటుంది. పార్టీ నేతలంతా ఎంపీ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైనప్పటికీ ఆవిర్భావ వేడుకలను సాదాసీదాగా నిర్వహించాలని నాయకులు, కార్యకర్తలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించారు. అయితే హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ‘2001లో రాష్ట్ర ఏర్పాటు కోసం పార్టీని కేసీఆర్ ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ పుట్టుక ఒక సంచలనం అని ఆయన అన్నారు. ఎన్నో ప్రతికూలతల మధ్య రాష్ట్ర పార్టీని ఏర్పాటు చేశారు. కేసీఆర్ నడిపిన తెలంగాణ ఉద్యమం దేశంలోని అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. తెలంగాణ ప్రజల సహకారంతోనే రాష్ట్రం సాకారం అయింది అని కేటీఆర్ అన్నారు.

Recent

- Advertisment -spot_img