Homeహైదరాబాద్latest News'కోదండరాంపై KTR చేసిన వ్యాఖ్యలు అమానుషం'

‘కోదండరాంపై KTR చేసిన వ్యాఖ్యలు అమానుషం’

గవర్నర్ కోటాలో తెలంగాణ జేఏసీ చైర్మన్ ఆచార్య కోదండరాం నియమించడం పట్ల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ జన సమితి దేవరకొండ నియోజకవర్గం ఇంచార్జ్ కర్ణ కంటి కిరణ్ తీవ్రంగా ఖండించారు. అధికారం కోల్పోయిన అక్కసుతో కేటీఆర్ ఏం మాట్లాడుతున్నారో తనకే అర్థం కావటం లేదని విమర్శించారు. కేటీఆర్ మరోసారి తెలంగాణ ఉద్యమకారులపై తెలంగాణ వాదులపై తన అసూయను అక్కసను వెళ్లగకుతున్నారు. అధికారంలో ఉన్న 10 సంవత్సరాలులు తెలంగాణ ఉద్యమకారులను, తెలంగాణ వాదులను ప్రజాసంఘాల నాయకులను ఏనాడు వారిని కనీసం పలకరించలేదు, తనకున్న అధికారంతో వాళ్ల గొంతు నొక్కడమే కాకుండా అరెస్టులతో నిర్బంధిస్తూ వాళ్లన భయాందోళనలకు గురి చేశారన్నారు.

కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను ప్రజాసంఘాల నాయకులను గౌరవించడం చూసి తట్టుకోలేక అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండి పడ్డారు. అధికారంలో ఉన్న 10 ఏళ్ళు తెలంగాణ ఉద్యమకారులను తెలంగాణ వాదులను పక్కనపెట్టి తెలంగాణ ద్రోహులను వెంటేసుకొని తిరిగిన కేటీఆర్ ఈరోజు మళ్లీ అదే పంతాను కొనసాగిస్తూ ఉన్నారని చెప్పారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఓటు అనే ఆయుధంతో వాళ్లని తిరస్కరించిన ఇంకా వాళ్ల విధానం మారకపోవడం శోచనీయమని పేర్కొన్నారు.

ఇదేవిధంగా తెలంగాణ వాదులను ఉద్యమకారులను అవమానపరుస్తూ మాట్లాడితే జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తెలంగాణ ప్రజలు వారికి కర్రు కాల్చి వాత పెట్టడం జరుగుతుంది అని తెలిపారు. అసలు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలంగాణ అనే పదం ఉచ్ఛరించే అర్హత లేదనీ.. ఎప్పుడైతే వాళ్ల పార్టీని టిఆర్ఎస్ నుండి బిఆర్ఎస్ గా మార్చుకున్నారో ఆరోజే వాళ్లకు తెలంగాణ ప్రజలకు బంధం తెగిపోయిందని అన్నార. మళ్లీ ఏదో నానా రభస చేసి ఏదో చేయాలనుకోవడం వాళ్ళ సంస్కారానికి నిదర్శమని పేర్కొన్నారు . కార్యక్రమంలో యాదాచారి , సత్యనారాయణ , ఉదయ్ కుమార్, సతీష్ ,గణేష్ తదితరులు పాల్గొన్నారు

Recent

- Advertisment -spot_img