Homeజిల్లా వార్తలుACBకి పట్టుబడ్డ KU అసిస్టెంట్ రిజిస్ట్రార్

ACBకి పట్టుబడ్డ KU అసిస్టెంట్ రిజిస్ట్రార్

ఇదేనిజం, వరంగల్ ప్రతినిధి: కాకతీయ యూనివర్సిటీ ఏసీబీ సోదాలు కలకలంరేపాయి. రూ.50 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అసిస్టెంట్ రిజిస్ట్రార్ కిష్టయ్య ఏసీబీ అధికారులకు పట్టుపడ్డాడు. విద్యార్థుల ట్యూషన్ ఫీజులు, ఇతర రుసుముల స్వీకరణలో జరిగిన రూ. మూడు కోట్ల కుంభకోణంపై ఏ ఆర్ కిష్టయ్య, ప్రిన్సిపాల్ బన్న అయిలయ్యపై విచారణ కమిటీ వుండగానే ఏ.ఆర్ కిష్టయ్యను వీసీ రమేష్ క్యాంపస్ కు మార్చారు. న్యాక్ కొరకు కేటాయించిన రూ.10 కోట్ల బిల్లులపై చేతి వాటం కొరకే కిష్టయ్యను క్యాంపస్ కు వీసీ రమేష్ బదిలీ చేయించారని గతంలో ఆరోపణలు కూడా వచ్చాయి.

యూనివర్సిటీలో కీలకమయిన నాలుగు కార్యాలయాలకు కిష్టయ్యను ఒక్కడినే అసిస్టెంట్ రిజిస్ట్రార్ గా వీసీ నియమించారు. న్యాక్ సందర్భంగా వర్సిటీలో రోడ్లు, హాస్టళ్లు, ఇతర బిల్డింగ్ ల కొరకు రూ.10 కోట్ల కేటాయించారు. వీటిలో కమీషన్ల కొరకే బిల్డింగ్ డివిజన్, పబ్లికేషన్స్ సెల్, హాస్టల్ ఆఫీస్ లతో బాటు యూనివర్సిటీ ఆడిట్ ఆఫీస్ కు కూడా కిష్టయ్య నే అసిస్టెంట్ రిజిస్ట్రార్ గా నియమించారు. ఒక హాస్టల్ లోనే ఒక పాలు అమ్మే వ్యాపారి దగ్గరి నుండి యాభై వేలు లంచం తీసుకోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఇంకా దీని వెనుక వీసీ రమేష్ లాంటి పెద్ద పెద్ద తిమింగలాలు ఉన్నాయనే రీతిలో ఏసీబీ విచారణ జరుపుతుంది.

Recent

- Advertisment -spot_img