Homeహైదరాబాద్latest Newsకూకట్ పల్లి అత్యాచారం, హత్య కేసు.. పక్కా ప్లాన్ తో నిందితులను పట్టుకున్న పోలీసులు

కూకట్ పల్లి అత్యాచారం, హత్య కేసు.. పక్కా ప్లాన్ తో నిందితులను పట్టుకున్న పోలీసులు

పక్కా ప్లాన్ తో మహిళా అత్యాచారం, హత్య కేసును కూకట్​పల్లి పోలీసులు మూడు రోజుల్లో ఛేదించి నిందితుల్ని అరెస్టు చేశారు. అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం, ఆపై హత్య. సీసీటీవీ కెమెరాల్లో ఇద్దరు పరారైన అస్పష్ట చిత్రాలు తప్ప పోలీసులకు మరో ఆధారము లభించలేదు. వేలి ముద్రలు, జాగిలాల ద్వారా నిందితుల్ని గుర్తించాలనుకున్నా ఆచూకీ చిక్కలేదు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఆ మహిళ హత్య కేసును కూకట్‌పల్లి పోలీసులు ఛేదించారు. దాదాపు 45 కిలోమీటర్ల మేర 14 వందల సీసీటీవీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. చివరగా మహిళ హత్యాచారం కేసులో పోలీసులు ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు.

బీహార్​కు చెందిన నితీష్​ కుమార్​ దేవ్​(24), మరొక మైనర్​ ఇద్దరు సంగారెడ్డిలోని తిరుమల బార్​ అండ్​ రెస్టారెంట్​లో పని చేస్తున్నారు. ఈ నెల 20వ తేదిన బీహార్​కు వెళ్తున్న తమ స్నేహితుడిని సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లో దించి అక్కడి నుంచి ఏపీ 28 డిక్యూ 1352 నెంబర్​ గల బజాజ్​ పల్సర్​ బైక్​పై​ సంగారెడ్డికి బయలు దేరారు. ప్రశాంత్​నగర్​ వద్దకు చేరుకున్న తరువాత అక్కడ టీ తాగడానికి ఆగిన క్రమంలో సమీపంలో ఉన్న ఓ మహిళ(40 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు)ను గమనించి సదరు మహిళను నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకు వెళ్లేందుకు పథకం పన్నారు. ప్రశాంత్​నగర్​లోన విష్ణుప్రియ లాడ్జి వద్ద సెల్లార్​ వద్ద నిర్మానుష్యంగా ఉండడాన్ని గమనించిన ఇద్దరు నిందితులు మహిళను అక్కడికి లాక్కెళ్లారు. మహిళా నిరాకరించడంతో మహిళను కాళ్లు పట్టుకుని సెల్లార్​లోకి లాక్కెళ్లారు. అనంతరం సెల్లార్‌లో ఆమెపై ఇద్దరూ అత్యాచారానికి పాల్పడ్డారు. వీరి నుంచి తప్పించుకునే క్రమంలో మైనర్‌ బాలుడు ఆమె కాళ్లను అదిమిపట్టాడు. నితీశ్‌ కుమార్‌ ఆమె తలను బలంగా నేలకు కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై కొద్దిసేపటికి మరణించింది.

సమాచారం తెలుసుకున్న కూకట్‌పల్లి పోలీసులు కేసును సవాల్​గా తీసుకున్నారు. తెల్లవారుజామున 4.30 గంటల సమయం కావడంతో సీసీటీవీ కెమెరాల్లో కొన్ని దృశ్యాలు నమోదై అస్పష్టంగానే ఉన్నాయి. దర్యాప్తు సంక్లిష్టంగా మారడంతో పోలీస్‌ సిబ్బంది నాలుగు బృందాలు ఏర్పాటు చేశారు. సుమారు 45 కిలోమీటర్ల పొడవునా మొత్తం 1,400 కెమెరాలను పరిశీలించారు. అందులో నిందితులు వినియోగించిన వాహనాన్ని పోలీసులు గుర్తించారు. నిందితులు సంగారెడ్డిలోని ఒక బార్‌లో పనిచేస్తున్నట్లు గుర్తించారు. పోలీసులు అక్కడికి వెళ్లి చూడగా నిందితులు, నింపాదిగా ఉండడం చూసి వారిని అదుపులోకి తీసుకున్నారు. నితీష్‌కుమార్‌ను రిమాండుకు తరలించి మైనర్‌ బాలుడిని జువైనల్‌ హోమ్‌కు తరలించారు. హత్య కేసు ఆధారాలు లేకపోయినా వారంలో నిందితులను పట్టుకోవడంతో కూకట్​పల్లి పోలీసులు చేసిన కృషిని సైబరాబాద్​ సీపీ అవినాశ్​ మహంతి అభినందించారు.

Recent

- Advertisment -spot_img