Homeహైదరాబాద్latest Newsవర్షాలు కురువాలని అడవి తల్లిని వేడుకున్న కురుమలు

వర్షాలు కురువాలని అడవి తల్లిని వేడుకున్న కురుమలు

ఇదే నిజం, గూడూరు: వర్షాకాలం ప్రారంభమై 20 రోజులు కావస్తున్న గూడూరు మండలంలో వర్షాలు పడకపోవడంతో ప్రజలు, వర్షాలు కురవాలని వన దేవతలను వేడుకున్నారు. గొల్లగూడెం గ్రామంలోని కురుమ కులస్తులు వనభోజనాలకు వెళ్లారు. అక్కడ అడవి తల్లికి పూజలు చేసి, వర్షాలు కురవాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు కోలాటాలు, కప్పతల్లి పాటలు పాడారు. ఈ సందర్భంగా కుల పెద్దలు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం ఈ రుతువులో వర్షాలు సకాలంలో కురియాలని, పిల్లాపాపలు, పాడి, పరిశ్రమలు చల్లంగా ఉండాలని, ప్రతి సంవత్సరం వనభోజనాలకు వస్తామని వారు తెలిపారు. తల్లిని పూజించడం వల్ల వర్షాలు పడతాయని వారి ప్రగాఢ విశ్వాసం. ఈ కార్యక్రమంలో కుల పెద్దలు మండల కొమురయ్య, మంగ చేరారు, మండల ఉపేందర్, కుండె కిషన్, కోరే పాపయ్య, చీర బిక్షపతి, మండల శ్రీనివాస్, మండల మల్లేష్, కోరె అనిల్, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img