బీజేపీ సీనియర్ నాయకుడు, భారత మాజీ ఉపప్రధాని ఎల్.కే.అద్వానీని దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ వరించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అద్వానీ ఇంటికి వెళ్లి అవార్డును ప్రదానం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్ ఖర్, వెంకయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు. అద్వానీ భారతీయ జనతా పార్టీ సహవ్యవస్థాపకులలో ఒకరు. కుల, మత, ప్రాంతీయ భేదం లేకుండా దేశ ఔన్నత్యాన్ని, కీర్తిని పెంపొందించడానికి విశేష కృషి చేసినవారికి ఈ అవార్డు ఇస్తారు. 1954 నుంచి భారతరత్న అవార్డును ప్రదానం చేస్తున్నారు.