Homeహైదరాబాద్latest NewsSHOCKING: కంగనా రనౌత్‌ ను చితక్కొట్టిన లేడీ కానిస్టేబుల్‌.. ఎందుకంటే..?

SHOCKING: కంగనా రనౌత్‌ ను చితక్కొట్టిన లేడీ కానిస్టేబుల్‌.. ఎందుకంటే..?

కంగనా రనౌత్ కు నేడు చండీగఢ్ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం జరగనున్న ఎంపీల సమావేశంలో పాల్గొనడానికి ఆమె ఢిల్లీ వెళుతుండగా చండీగఢ్ ఎయిర్పోర్టులో విధుల్లో ఉన్న సిఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ తనని చెంప దెబ్బ కొట్టారని కంగనా రనౌత్ ఆరోపించడం తీవ్ర దుమారం రేపుతోంది. హిమాచల్ ప్రదేశ్ లోని మండి నుంచి లోక్సభ ఎన్నికల్లో గెలిచిన రెండు రోజుల వ్యవధిలోనే కంగనా రనౌత్ పబ్లిక్ గా చేదు అనుభవాన్ని చవిచూశారు. యూకే 707విమానంలో చండీగఢ్ విమానాశ్రయం నుండి ఢిల్లీకి వెళ్లేందుకు ఎయిర్పోర్టుకు చేరుకున్న క్రమంలో బోర్డింగ్ పాయింట్ వద్దకు వెళుతున్నప్పుడు తనతో పుల్వీందర్ కౌర్ అనే సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ వాగ్వాదానికి దిగినట్టు కంగనా తెలిపారు.

Recent

- Advertisment -spot_img