మే 31లోగా పాన్‌ను ఆధార్‌తో లింకు చేసుకోవాలని ఆదాయపు పన్నుశాఖ తెలిపింది. లేదంటే సాధారణం కన్నా రెట్టింపు ట్యాక్స్ విధించనున్నట్లు ఓ సర్క్యులర్ ద్వారా హెచ్చరించింది. ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ (టీడీఎస్) అధికంగా విధిస్తామని చెప్పింది. ఒకవేళ లింక్ చేసుకోకుంటే టీడీఎస్ మినహాయింపు స్వల్పంగా ఉంటుందని పేర్కొంది. బ్యాంకులు, ఫారెక్స్ డీలర్ల వంటి సంస్థలు స్టేట్‌మెంట్ ఆఫ్ స్పెసిఫైడ్ ఫైనాన్సియల్ ట్రాన్షాక్షన్స్ (ఎస్‌ఎఫ్‌టీ) ను ఫైల్ చేయడానికి మే 31 చివరితేదీ అని గుర్తు చేసింది.